loading

Tollywood Movies

loading loading loading loading loading loading loading loading loading loading
Latest News

"ఉయ్యాలవాడలో" బిగ్ బి

చిరంజీవి నటించనున్న 151 వ సినిమా "ఉయ్యాలవాడ నరసింహారెడ్డి " బుధవారం లాంచ్ అయ్యింది.చిరంజీవి ఇందులో స్వతంత్ర సమారయోధుడిగ నటించనున్నారు. ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక ముఖ్య పాత్ర చేయబోతున్నారు అని సమాచారం... ఆగష్టు 22 , మన మెగాస్టార్ పుట్టిన రోజు సందర్బంగా టైటిల్ మరియు మోషన్ పోస్టర్ లాంచ్ చేస్తున్నారు.ఈ సినిమా తెలుగు, హిందీ మరియు కన్నడ లో చిత్రీకరించనున్నారు..

MAHESH @25 LAUNCH

మహేష్ బాబు 25వ సినిమా ప్రారంభ ముహూర్తం నిన్న జరిగింది.దీనికి డైరెక్టర్ వంశి పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ దీనికి సంగీతం చేస్తున్నారు.అశ్వినీదత్ ,దిల్ రాజు దీనికి నిర్మాతలు.మహేష్ బాబు భార్య నమ్రత మరియు పిల్లలు గౌతమ్ సితారలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ సినిమా వచ్చే సంవత్సరం విడుదల కానుంది. మహేష్ 23 వ చిత్రం spyder రిలీజ్ కి రెడీగా ఉంది, కొరటాల శివ తో 24 వ చిత్రం అన్న విషయం మన అందరికి తెలిసిందే..

'Jogendra' surprises in BigBoss telugu show

Rana surprises the Big Boss telugu show hosted by Jr.Ntr as a first special guest. The show is going to be aired on 06.08.2017.With his upcoming film Nene Raju Nene Mantri lined up for release on August 11th, it is expected that Rana Daggubati is going to promote his film. Bigg Boss Telugu is ranked at the top in terms of ratings, according to the latest trade reports and the channel broadcasting show jumped to the NO.1 spot in terms of TRPs after the show went on air. With this kind of special guests visiting the Bigg Boss house, further episodes of the show are expected to be more exciting.

సమ్మె.. అదే నాకు నచ్చని పదం: రజనీ

దక్షిణ భారత చలనచిత్ర కార్మికుల సంఘాల సమాఖ్య (ఫెప్సీ), తమిళ నిర్మాతల మండలి మధ్య సయోధ్య కుదరని కారణంగా పలు తమిళ చిత్రాల షూటింగ్‌ వాయిదా పడిన సంగతి తెలిసిందే. మరికొన్ని చిత్రాల షూటింగ్‌ మాత్రం ప్రత్యామ్నాయ యూనిట్లతో యథాతధంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ స్పందించారు. ఇరు వర్గాలు సమస్యపై చర్చించుకోవాలని అనుకూలమైన పరిష్కారాన్ని కనుగొనాలని విజ్ఞప్తి చేశారు. ‘నాకు నచ్చని కొన్ని మాట్లల్లో సమ్మె ఒకటి. సమస్య ఏదైనా కానీ.. మనం మన ఇగోలను పక్కనబెట్టి ప్రజల బాగు గురించి ఆలోచిద్దాం. చర్చల ద్వారా మనం ఎప్పుడూ ఓ పరిష్కారాన్ని కనుగొనగలం. ఓ సీనియర్‌ నటుడిగా నిర్మాతల మండలి, ఫెప్సీకి విజ్ఞప్తి చేస్తున్నా.. మీరిద్దరూ మాట్లాడుకుని ఈ సమస్యకు ఓ మంచి పరిష్కారంతో రండి’ అంటూ సూచించారు. కథానాయకుడు విశాల్‌ ఆధ్వర్యంలోని తమిళ నిర్మాతల మండలి ఇటీవల ఫెప్సీలో సభ్యులు కాని టెక్నీషియన్లను నిర్మాతలు తమ చిత్రంలో తీసుకునేందుకు అనుమతినిచ్చింది. దీంతో వివాదం మొదలైంది. ఈ సందర్భంగా నిర్మాతలు వర్కర్స్‌కు తగిన డబ్బులు చెల్లించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారని అయితే కొందరు ఫెప్సీ వర్కర్స్‌ ఇష్టారీతిన రెమ్యునరేషన్స్‌ డిమాండ్‌ చేస్తున్నారని దీంతో నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారని ఓ ప్రకటనలో మండలి పేర్కొంది. ఫెప్సీలో దాదాపు 25,000 మంది సభ్యులున్నారు. ఇక మరోవైపు ఫెప్సీ అధ్యక్షుడు ఆర్‌కే సెల్వమణి కార్మికుల జీతాలను పెంచాలని కోరుతూ తాము చేస్తున్న డిమాండ్‌ నెరవెరక పోతే నిరవధిక సమ్మెకు దిగుతామని ప్రకటించారు. దీని ప్రకారం మంగళవారం నుంచి సమ్మెకు దిగడంతో ఫెప్సీలో సభ్యులుగా ఉన్న కార్మికులు ఎవరూ చిత్రీకరణల్లో పాల్గొనలేదు. నిలిచిన ‘కాలా’ చిత్రం షూటింగ్‌ రంజిత్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ నటిస్తున్న ‘కాలా’ సినిమా చిత్రీకరణ మంగళవారం నిలిచిపోయింది. ఈ సినిమా కోసం చెన్నైలో ప్రత్యేక సెట్‌ ఏర్పాటు చేశారు. దీంతో సకాలంలో ఇక్కడ చిత్రీకరణ పూర్తి చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ముంబయి నుంచి కొత్త బృందాన్ని తెప్పించే పనుల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

రూ.20 కోట్లు!....... 8 నిమిషాల్లో

ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో మహేశ్‌బాబు నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘స్పైడర్‌’. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. దర్శకుడు ఎస్‌జే సూర్య విలన్‌గా నటిస్తున్నారు. ఇటీవలే మహేశ్‌బాబు, ఎస్‌జే సూర్యల మధ్య జరిగే పోరాట సన్నివేశాలను తెరకెక్కించారు దర్శకుడు. ఎనిమిది నిమిషాల పాటు సాగే వీరిద్దరి సన్నివేశమే సినిమాలో హైలెట్‌గా ఉంటుందని కోలీవుడ్‌ సమాచారం. అంతేకాకుండా సినిమాలో ఇదే అతిపెద్ద ట్విస్ట్‌ అని చెబుతున్నారు. ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న ఈ సన్నివేశం చిత్రీకరణకు ఏకంగా రూ.20 కోట్లు ఖర్చు పెట్టారట మురుగదాస్‌. అంతేకాకుండా ఈ సన్నివేశానికి గ్రాఫిక్‌ సొబగులు అద్దనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై తమిళంలోనూ అంచనాలు మొదలయ్యాయి. ఇప్పటికే మహేశ్‌బాబుకు తమిళంలో అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. తొలిసారిగా ఆయన నేరు చిత్రంలో అందులోనూ తమిళ దర్శకుడి సినిమాతో రావడంతో అప్పుడే వాణిజ్య కార్యక్రమాలు మొదలైనట్లు సమాచారం. ఇదిలా ఉండగా ‘కత్తి’, ‘తుపాక్కి’ వంటి మాస్‌ హిట్లు అందిచ్చిన మురుగదాస్‌ తదుపరి సినిమా కావడంతో ఆయన అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

చరణ్ చిత్రం ఈ సంక్రాంతి కేయే

ఇప్పుడు వచ్చే ఏడాది సంక్రాంతికి ఏయే సినిమాలు వస్తున్నాయి అనే దానిపై చాలా పెద్ద చర్చే నడుస్తోంది. ఆల్రెడీ ఓ రెండుసార్లు తలపడిన సంక్రాంతి పుంజులు మహేష్ బాబు అండ్ రామ్ చరణ్ తమ సినిమాలను ఆల్రెడీ ఆ ఫెస్టివల్ టైముకు ప్రకటించేశారు. కొరటాల శివ డైరక్షన్లో రూపొందుతున్న భరత్ అను నేను.. అలాగే సుకుమార్ తీస్తున్న రంగస్థలం 1985 కూడా సేమ్ అదే టైముకు ఫిక్స్ చేశారు. కాకపోతే కొత్తగా పవన్ కళ్యాణ్ అండ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న కొత్త సినిమా కూడా అదే సంక్రాంతి 2017కు దించాలని ప్లాన్ చేయడం.. ఇప్పుడు మూడు పెద్ద సినిమాలు ఒకేసారి హౌ అండీ హౌ అంటూ ట్రేడ్ వర్గాలను కలవరపెట్టేస్తున్నాయి. అయితే బాబాయ్ కోసం రామ్ చరణ్ ఇప్పుడు రేసు నుండి తప్పుకుంటాడంటూ ఒక టాక్ వచ్చింది. కాని ఇదే విషయాన్ని రంగస్థలం టీమ్ దగ్గర ప్రశ్నిస్తే.. అబ్బే అదేం లేదు అంటున్నారు. ఆల్రెడీ పవన్ అండ్ మహేష్ సినిమాల ప్రొడ్యూసర్లతో మాట్లాడే డేట్లన్నీ కన్ఫామ్ చేసుకున్నారట. అందుకే రంగస్థలం 1985 సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికే వస్తుందని చెబుతున్నారు. ఆల్రెడీ సుకుమార్ కూడా చాలా స్పీడప్ చేసి షూటింగ్ చేయడం వలన.. ఇప్పుడు అనుకున్న టైమ్ కు రాకపోవడం వంటి కూడా లేదంటున్నారు. అదే విధంగా రామచరణ్ సినిమాను డిసెంబర్ లోకి తీసుకొస్తారని.. అప్పుడు అఖిల్ సినిమా ఈ సినిమాతో క్లాష్ అయ్యే పరిస్థితి ఉందని కొందరు అంటున్నారు కాని.. ఇలా రంగస్థలం సంక్రాంతికే వస్తే ఆ టాక్ అంటా జస్ట్ టాక్ గానే మిగిలిపోతుంది. అది సంగతి.

ఫిదా.....కమ్ముల ఈజ్ బ్యాక్!

నిన్న విడుదలైన శేఖర్ కమ్ముల సినిమా ‘ఫిదా’కు పాజిటివ్ టాక్ వచ్చింది. కమ్ముల ఈజ్ బ్యాక్ అంటూ అతడి అభిమానులు మురిసిపోతున్నారు. ఈ సినిమాకు ‘ఎ’ సెంటర్లలో రెస్పాన్స్ బాగుంది. ఓవర్సీస్ లో కూడా ఓపెనింగ్స్ ఓకే అనిపిస్తున్నాయి. కానీ ఈ చిత్రం బి-సి సెంటర్లలో మాత్రం పెద్దగా జనాల్ని ఆకర్షించలేకపోతోంది. తొలి రోజు పెద్ద సిటీల్లో మంచి వసూళ్లు వచ్చినప్పటికీ.. చిన్న నగరాలు.. పట్టణాల్లో ఆశించి స్పందన లేదు. ఆక్యుపెన్సీ లేక థియేటర్లు డల్లుగా కనిపించాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వరుణ్ తేజ్ చివరి సినిమా ‘మిస్టర్’ డిజాస్టర్ అయినప్పటికీ మాస్ సెంటర్లలో దానికి తొలి రోజు మంచి స్పందనే వచ్చింది. హౌస్ ఫుల్స్ పడ్డాయి. కానీ ‘ఫిదా’ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ దానికి ఆశించిన స్పందన లేదంటున్నారు. మామూలుగానే శేఖర్ కమ్ముల సినిమాలు అర్బన్ ఆడియన్స్ కు మాత్రమే కనెక్టవుతుంటాయి. ‘హ్యాపీడేస్’ యూత్ ఫుల్ మూవీ కావడంతో అది ఎక్కువ మందికి చేరువైంది. మిగతా సినిమాలేవీ కూడా కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాలేదు. ఎ సెంటర్ల ఆడియన్స్ మాత్రమే ఆ సినిమాల్ని ఆదరించారు. ‘ఫిదా’ కూడా అందుకు మినహాయింపేమీ కాదు. ఇందులోని క్లాస్ ఎంటర్టైన్మెంట్ మాస్ ప్రేక్షకులకు ఎంతవరకు ఎక్కుతుందన్నది సందేహమే. ఫస్టాఫ్ అయినా కామెడీతో నడిచిపోతుంది కానీ.. సీరియస్ గా.. సాగతీతగా అనిపించే ద్వితీయార్ధాన్ని మాస్ ప్రేక్షకులు తట్టుకోవడం కష్టమే. ఆ వర్గం ప్రేక్షకులు తొలి రోజే నిరాశ వ్యక్తం చేశారు. కాబట్టి బి-సి సెంటర్లలో ‘ఫిదా’ సేఫ్ జోన్లోకి రావడం కష్టమే అంటున్నారు. వీకెండ్లోనే పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటే సోమవారం నుంచి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారొచ్చని బయ్యర్లు భయపడుతున్నారు.

Chiranjeevi's Title For Raghu Kunche's 1st Production

So far you have known Raghu Kunche as a talented singer, music director and an actor as well. But now, Raghu is spreading his arms and getting into a new segment. Well, Raghu kunche has entered production side and is preparing for his first project.

Rana's Nenu Raju Nene Mantri Trailer On

Well, to continue this positive talk, the team of #NeneRajuNeneMantri planned to release the trailer on June 23rd at 10 AM. They also took the decision to attach the trailer to Stylish Star Allu Arjun’s Duvvada Jagannadham releasing on June 23.

Allari Naresh In Rs 100 Cr Film

While marking the budget for a project, you would also consider the stamina of the hero at the box office. Given that, it is only the big league superstars who are currently able to get into the 100 crores sector. But here is one interesting news about another hero.